సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు రద్దు
ABN , First Publish Date - 2020-06-25T22:24:43+05:30 IST
సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు..

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రెండ్రోజుల్లో రానుంది. గత అకాడమిక్ ఇయర్‌లోనే 10, 12 తరగతులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. అయితే కొన్ని సబ్జెక్టులు మాత్రం మిగిలిపోయాయి. ఆ సబ్జెక్టులపై పరీక్షలు పెట్టాలని కొంతమంది కోరగా.. కరోనా నేపథ్యంలో వద్దని మరికొంతమంది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒకసారి ఆలోచించాలని కేంద్రప్రభుత్వానికి సూచిందింది.
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల పరీక్షలు రద్దు అవుతున్నాయి. దీంతో సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు. కాగా జులై 1 నుంచి 15 వరకు సీబీఎస్‌ఈ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం భావించిన విషయం తెలిసిందే.