ఫోన్‌లో కులం పేరుతో దూషణ ఎస్సీ, ఎస్టీ చట్టం కిందకు రాదు

ABN , First Publish Date - 2020-06-01T06:32:41+05:30 IST

కులం పేరుతో మొబైల్‌ ఫోన్‌లో చేసిన దూషణలను ఎస్సీ, ఎస్టీ చట్టం, 1989 కింద నేరంగా పరిగణించలేమని పంజాబ్‌, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగంగా కాకుండా ఫోన్‌లో తప్పుగా మాట్లాడటం...

ఫోన్‌లో కులం పేరుతో దూషణ ఎస్సీ, ఎస్టీ చట్టం కిందకు రాదు

  • హైకోర్టు 


చండీగఢ్‌, మే 31: కులం పేరుతో మొబైల్‌ ఫోన్‌లో చేసిన దూషణలను ఎస్సీ, ఎస్టీ చట్టం, 1989 కింద నేరంగా పరిగణించలేమని పంజాబ్‌, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగంగా కాకుండా ఫోన్‌లో తప్పుగా మాట్లాడటం అనేది ఫిర్యాదుదారున్ని కించపరచాలన్న ఉద్దేశాన్ని చూపదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ హర్‌నరేష్‌ సింగ్‌ గిల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కురుక్షేత్ర నివాసులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేశారు. వీరిద్దరూ వారి గ్రామ సర్పంచ్‌ను కులం పేరుతో మొబైల్‌ ఫోన్‌లో దూషించడమేకాకుండా చంపుతామని బెదిరించారన్న ఆరోపణలతో ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. 


Updated Date - 2020-06-01T06:32:41+05:30 IST