హాథ్రస్‌లో ఆప్ ఎమ్మెల్యే .. సోషల్ మీడియా ఆధారంగా కేసు నమోదు
ABN , First Publish Date - 2020-10-07T16:47:37+05:30 IST
ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్‌కు యూపీ పోలీసులు షాకిచ్చారు. ఎపిడమిక్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..

లక్నో: ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్‌కు యూపీ పోలీసులు షాకిచ్చారు. ఎపిడమిక్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 29న తాను కోవిడ్ బారిన పడినట్టు ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఐదు రోజులకే అనగా అక్టోబర్ 4న హాథ్రస్ వెళ్లినట్టు వీడియోలు షేర్ చేశారు. ఇది విపత్తుల నిర్వహణ చట్టం కింద నేరమని.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్టు హాథ్రస్ ఎస్పీ తెలిపారు. పాజిటివ్‌గా తేలిన తర్వాత నెగిటివ్ రిపోర్టులు తీసుకోకుండా.. హథ్రస్ వెళ్లడం ఎపిడమిక్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు.
