ఆరుగురికి కరోనా... సెల్‌ఫోన్ ఫ్యాక్టరీ మూసివేత

ABN , First Publish Date - 2020-05-19T00:53:45+05:30 IST

ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఏకంగా ఓ సెల్‌ఫోన్ ఫ్యాక్టరీనే మూసివేశారు. ఢిల్లీలోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో దాదాపు మూడు వేల మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. మళ్ళీ ఆదేశాలు జారీ అయ్యేంతవరకు ఎవరూ విధులకు హాజరు కావద్దన్న సర్క్యులర్ జారీ అయ్యింది.

ఆరుగురికి కరోనా... సెల్‌ఫోన్ ఫ్యాక్టరీ మూసివేత

న్యూఢిల్లీ : ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఏకంగా ఓ సెల్‌ఫోన్ ఫ్యాక్టరీనే మూసివేశారు. ఢిల్లీలోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో దాదాపు మూడు వేల మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. మళ్ళీ ఆదేశాలు జారీ అయ్యేంతవరకు ఎవరూ విధులకు హాజరు కావద్దన్న సర్క్యులర్ జారీ అయ్యింది.


అదే క్రమంలో... ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. కాగా కరోనా సోకిన ఉద్యోగులతో సన్నిహితంగామెలిగిన వారి వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇతర ఉద్యోగులు, కార్మికులకు కూడా స్క్రీనింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-19T00:53:45+05:30 IST