829 నౌకల్లో.. 29,058 మంది విలవిల

ABN , First Publish Date - 2020-03-18T07:25:13+05:30 IST

కరోనా కట్టడికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా.. దేశవ్యాప్తంగా పలు రేవుల్లో నిలిచిపోయిన 829 నౌకల్లో 29,058 మంది సిబ్బంది, ప్రయాణికులు విలవిలలాడుతున్నారు.

829 నౌకల్లో.. 29,058 మంది విలవిల

న్యూఢిల్లీ, మార్చి 17: కరోనా కట్టడికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా.. దేశవ్యాప్తంగా పలు రేవుల్లో నిలిచిపోయిన 829 నౌకల్లో 29,058 మంది సిబ్బంది, ప్రయాణికులు విలవిలలాడుతున్నారు. నౌకలోంచి దిగి దేశంలోకి ప్రవేశించలేక.. నౌకలోనే ఉండలేక అల్లాడుతున్నారు. ఫిబ్రవరి 1 తర్వాత కరోనా బాధిత దేశాలకు వెళ్లిన అంతర్జాతీయ నౌకలను మార్చి 31దాకా మన రేవుల్లోకి ప్రవేశించనీయకుండా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 829 నౌకలు మన రేవులకు సమీపంలో తమకు నిర్దేశించిన ప్రదేశాల్లో లంగరు వేసుకుని నిలిచిపోయాయి. వారికి స్ర్కీనింగ్‌ నిర్వహిస్తున్నామని, సాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-03-18T07:25:13+05:30 IST