కరోనా నెగిటివ్... ఆత్మహత్య చేసుకున్నాడు

ABN , First Publish Date - 2020-06-12T00:13:55+05:30 IST

కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న 33 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఈ వైరస్ బారినపడిన ఓ యువకుడుని ఇటీవల తిరువనంతపురం వైద్యకళాశాలలో చేర్చారు. అక్కడ ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు.

కరోనా నెగిటివ్... ఆత్మహత్య చేసుకున్నాడు

తిరువనంతపురం : కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న 33 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఈ వైరస్ బారినపడిన ఓ యువకుడుని ఇటీవల తిరువనంతపురం వైద్యకళాశాలలో చేర్చారు. అక్కడ ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు.


ఈ క్రమంలో రెండుసార్లు ఆసుపత్రి నుంచి పారిపోయిన రోగి తన ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసిన గ్రామస్థులు తిరిగి అతడిని పోలీసులకు పట్టించారు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. దీంతో అతడిని డిశ్చార్జ్ చేయాలని అధికారులు నిర్ణయించి అతడు ఉంటున్న ఐసోలేషన్ గదికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-06-12T00:13:55+05:30 IST