కరోనా ‘లాక్ డౌన్లతో’.. గాలిలో నాణ్యత మెరుగు
ABN , First Publish Date - 2020-03-23T06:27:41+05:30 IST
కరోనా కట్టడి కోసం ప్రపంచదేశాలు ప్రకటిస్తున్న లాక్‌డౌన్లు, జనతా కర్ఫ్యూలతో గాలి నాణ్యత పెరుగుతోందని ఇటీవల నిర్వహించిన పలు పరిశోధనల్లో...

కరోనా కట్టడి కోసం ప్రపంచదేశాలు ప్రకటిస్తున్న లాక్‌డౌన్లు, జనతా కర్ఫ్యూలతో గాలి నాణ్యత పెరుగుతోందని ఇటీవల నిర్వహించిన పలు పరిశోధనల్లో వెల్లడైంది. వాహన కాలుష్యం తగ్గడం, పరిశ్రమల కూతకు తాత్కాలిక బ్రేకులు పడటం, విద్యుత్తు డిమాండ్ పడిపోవడం, థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను ఆపివేయడం ఇందుకు ప్రధాన కారణాలని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కారణంగా కరోనాకు కేంద్రమైన చైనాలో వాతావరణ కాలుష్యం 25ు దాకా తగ్గిపోగా.. ఇతర దేశాల్లోనూ కర్బన ఉద్గారాలు తగ్గాయని పేర్కొన్నాయి. కాలుష్య కల్లోలిత ప్రాంతాల్లో ఒకటైన దేశ రాజధాని ఢిల్లీలో పీఎం-25 స్థాయి నిత్యం 300-500 మధ్యలో ఉంటుంది. కరోనా లాక్‌డౌన్‌లతో అది ఒక్కసారిగా 129కి పడిపోయింది. ఇకపై కొనసాగనున్న లాక్‌డౌన్, కర్ఫ్యూలతో ఇది మరింత దిగి వచ్చే అవకాశాలున్నాయని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్‌ఏక్యూడబ్ల్యూఎ్‌ఫఆర్) సంస్థ అంచనావేసింది.
మరికొన్ని విశేషాలు..
- ఇటలీలో నైట్రోజన్-డై-ఆక్సైడ్ విడుదల 10శాతం తగ్గిందని నాసా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో లాక్‌డౌన్ అయిన ప్రాంతాల్లోనూ నైట్రోజన్-డై-ఆక్సైడ్, కార్బన్-డై-ఆక్సైడ్, మిథేన్ విడుదల 36శాతం మేర తగ్గింది.
- గడిచిన 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతలా వెనిస్ నగరంలో కాలువల్లో నీళ్లు స్వచ్ఛంగా మారాయి.
- కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో.. న్యూయార్క్ నగరంలో కార్బన్, మిథేన్ ఉద్గారాల విడుదల 35ు తగ్గిందని తేలింది.
- విమానాలు రద్దవ్వడంతో గగనతలంలో విడుదలయ్యే కర్బన ఉద్గారాలు 5 శాతం తగ్గాయి.