శ్వాస పరీక్షతో నిమిషంలో కరోనా నిర్ధారణ

ABN , First Publish Date - 2020-10-21T08:47:16+05:30 IST

ముక్కు, గొంతు నుంచి స్రావాల సేకరణ, రక్త నమూనాల ఆధారంగా ఇప్పటివరకు కరోనాను నిర్ధారిస్తుండగా..

శ్వాస పరీక్షతో నిమిషంలో కరోనా నిర్ధారణ

సింగపూర్‌, అక్టోబరు 20: ముక్కు, గొంతు నుంచి స్రావాల సేకరణ, రక్త నమూనాల ఆధారంగా ఇప్పటివరకు కరోనాను నిర్ధారిస్తుండగా.. శ్వాస పరీక్షతో వైరస్‌ ఉందో లేదో చెప్పే సాంకేతికతను సింగపూర్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకు నిమిషం వ్యవధి మాత్రమే పట్టనుండటం గమనార్హం. ఇందుకు చేయాల్సిందల్లా.. శ్వాస నమూనాను అత్యంత కచ్చితంగా విశ్లేషించే పరికరంతో అనుసంధానమైన డిస్పోజబుల్‌ మౌత్‌ పీస్‌లో ముఖం పెట్టి గట్టిగా గాలి వదలడమే. అలా వదిలిన గాలిని.. భారీ స్పెకో్ట్రమీటర్‌పై ఉంచితే అందులోని వొలాటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ (వీవోసీ)ను మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ విశ్లేషిస్తుంది. 180 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో వైరస్‌ నిర్ధారణ 90 శాతం కచ్చితత్వంతో ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

Updated Date - 2020-10-21T08:47:16+05:30 IST