భారత్‌లో 10కి చేరిన కరోనా మృతులు

ABN , First Publish Date - 2020-03-24T15:49:53+05:30 IST

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మంగళవారంనాడు మరింత పెరిగింది. మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ..

భారత్‌లో 10కి చేరిన కరోనా మృతులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మంగళవారంనాడు మరింత పెరిగింది. మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 504కు చేరుకోగా, 37 మందికి పూర్తిగా స్వస్థత చేకూరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 457గా ఉంది.


కరోనా వైరస్ విస్తరించకుండా మంగళవారం నుంచి డొమెస్టిక్ విమానాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు చర్యలను ముమ్మరం చేసింది. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని  సూచించారు. కొత్తగా 74 కోవిడ్-19 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. మార్చి 20న నమోదైన కేసులకు రెట్టింపు కేసులు ప్రస్తుతం నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,78,829కు చేరగా, 16,509 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మంగళవారంనాడు 602 కొత్త మరణాలు సంభవించినట్టు ఇటలీ ప్రకటించింది. దీంతో అక్కడ మృతుల సంఖ్య 6,077కు చేరింది.

Read more