ఐఎస్ఎస్‌కు కార్గో స్పేస్‌షిప్.. కల్పనా చావ్లా పేరు పెట్టిన నాసా

ABN , First Publish Date - 2020-10-04T00:15:24+05:30 IST

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుక్రవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఎన్ఎస్ఎస్) పంపిన కార్గో స్పేస్‌క్రాఫ్ట్‌కు భారతీయ సంతతి

ఐఎస్ఎస్‌కు కార్గో స్పేస్‌షిప్.. కల్పనా చావ్లా పేరు పెట్టిన నాసా

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుక్రవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఎన్ఎస్ఎస్) పంపిన కార్గో స్పేస్‌క్రాఫ్ట్‌కు భారతీయ సంతతి తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా పేరు పెట్టింది. వర్జీనియాలోని వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ నుంచి అంటారెస్ రాకెట్ ద్వారా సిగ్నస్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఎన్ఎస్ఎస్‌కు పంపింది.    


కమర్షియల్ కార్గో స్పేస్‌క్రాఫ్ట్ అయిన దీనికి ఎస్ఎస్ కల్పనా చావ్లా పేరు పెట్టింది. స్పేస్ వాకింగ్ కోసం 360 డిగ్రీ కెమెరా, ముల్లంగి విత్తనాలు, ఆహారం, మాంసం, చీజ్ తదితర వాటిని ఇది మోసుకెళ్లింది. మొత్తం 8 వేల పౌండ్ల షిప్‌మెంట్‌తో బయలుదేరిన ఈ అంతరిక్ష నౌక సోమవారం నాటికి అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నట్టు నాసా తెలిపింది.

Updated Date - 2020-10-04T00:15:24+05:30 IST