కూటమికి గుడ్‌బై చెప్పనున్న కెప్టెన్.. ఒంటరి పోరేనా..?
ABN , First Publish Date - 2020-12-29T15:13:59+05:30 IST
వచ్చే యేడాది జరుగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ సినీనటుడు విజయకాంత్ నాయకత్వంలోని డీఎండీకే ఒంటరిపోరు దిశగా అడుగులు వేస్తోంది.
చెన్నై : వచ్చే యేడాది జరుగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ సినీనటుడు విజయకాంత్ నాయకత్వంలోని డీఎండీకే ఒంటరిపోరు దిశగా అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకేకు షాక్ ఇచ్చేలా సోమవారం ఉదయం విజయకాంత్ రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జ్జులను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. నిజానికి అన్నాడీఎంకే కూటమిలో కొనసాగుతున్న డీఎండీకేకు అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులను నియ మించుకోవాల్సిన అవసరం లేదు. విజయకాంత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డీఎండీకే అన్నాడీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల జరిగిన ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుల సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని అధికమంది జిల్లా నేతలు విజయకాంత్‌కు సలహా ఇచ్చారు. ఈసారి అన్నాడీఎంకే కూటమిలో కొనసాగితే తక్కువ సీట్లలోనే పోటీ చేయాల్సి వస్తుందని, తమ పార్టీకంటూ ఉన్న ఓటు బ్యాంకును అధికం చేసు కోవడానికి ఆ సీట్లు చాలవని సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఆ సమావేశం తర్వాత డీఎండీకే కోశాధికారి ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ వచ్చే యేడాది జనవరిలో జరిగే సర్వసభ్య మండలిలో అన్నాడీఎంకే కూటమిలో కొనసాగాలా? లేక ఒంటరిగా పోటీ చేయాలా? అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటిం చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం విజయకాంత్ 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జుల ను నియమిస్తూ ప్రకటన జారీ చేశారు.ఆ మేరకు 40 నియోజకవర్గా లకు పార్టీ ఇన్‌చార్జులుగా నియమితు లైన వారి వివరాలు ప్రకటించారు.