వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్లమెంట్ సమావేశాలు..!

ABN , First Publish Date - 2020-05-17T15:58:44+05:30 IST

కెనడా పార్లమెంట్ సమావేశాలు కూడా ఆన్‌లైన్‌లో ప్రస్తుతం జరిగాయి. ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటూ అతి కొద్ది మంది మాత్రమే సభకు హజరవగా.. అత్యధిక శాతం సభ్యులు ఇళ్ల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాసనసభ సమావేశాల్లో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్లమెంట్ సమావేశాలు..!

ఒట్టొవా: మనిషి జీవితంలోని అన్ని పార్శ్వాలను కరోనా మహమ్మారి సమూలంగా మార్చేస్తోంది. ఒకప్పుడు...అరుదుగా మాత్రమే వినిపించే వీడియో కాన్ఫరెన్సింగ్ లాంటి పదాలు ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయాయి. విద్యార్థుల తరగతులు, ఉద్యోగాలే కాకుండా.. ఏకంగా కోర్టు విచారణలు, పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి. జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లు ఈ దృ‌శ్యాలకు వెదికలయ్యాయి. 


కెనడా పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటూ అతి కొద్ది మంది మాత్రమే సభకు హాజరవగా.. అత్యధిక శాతం సభ్యులు ఇళ్ల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాసనసభ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జూమ్ యాప్ ద్వారా ప్రతి మంగళ, గురువారాల్లో ఎంపీలు ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఇది తొలి సెషన్ కావడంతో కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తాయి. కొందరు సభ్యులు, మంత్రుల మాటలు స్పష్టంగా వినపడకపోవడంతో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇక బ్రిటన్, లాట్వీయాల్లోనూ ఆన్‌లైన్ ద్వారా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ‘మనం వైరస్‌లకు వాహకాలుగా మారకూడదు. అందుకే ఈ ప్రయాస అంతా’ అని ఈ సందర్భంగా కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-17T15:58:44+05:30 IST