దర్యాప్తుపై కెమెరా నిఘా
ABN , First Publish Date - 2020-12-03T07:19:29+05:30 IST
దర్యాప్తు, విచారణ సంస్థలన్నింటిలోనూ సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

అన్ని విచారణ సంస్థల్లో సీసీటీవీలుండాలి
ఆరు నెలల పాటు ఆ ఫుటేజీ ఉంచాలి
ఫుటేజీ కోరడం బాధితుల హక్కు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అన్ని విచారణ సంస్థల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి.. నైట్‌విజన్ కెమెరాలను వాడాలి: సుప్రీం
న్యూఢిల్లీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దర్యాప్తు, విచారణ సంస్థలన్నింటిలోనూ సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ, ఎస్‌ఎ్‌ఫఐవో, డీఆర్‌ఐ, ఎన్‌సీబీ సహా అరె్‌స్టలు చేసి ఇంటరాగేట్ చేసే ఏ దర్యాప్తు సంస్థలోనైనా సీసీ కెమెరాలు తప్పనిసరని తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా ప్రతీ పోలీ్‌సస్టేషన్‌లో సీసీటీవీల ఏర్పాటు జరగాలని గుర్తు చేస్తూ ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులను కేటాయించాలని ఆదేశించింది. రాత్రిపూట కూడా రికార్డ్ చేయగల కెమెరాలను అమర్చాలని బుధవారం నాడు వెలువరిచిన ఓ కీలకమైన తీర్పులో జస్టిస్ నారిమన్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఆదే శించింది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదు చేసే వ్యక్తులకు- సీసీటీవీ ఫుటేజిని కోరే హక్కుంటుందని తీర్పులో బెంచ్ స్పష్టం చేసింది.
ఈ వీడియో రికార్డులను సమర్పించమనే అధికారం న్యాయస్థానాలు, మానవ హక్కులసంఘాలకు కూడా ఉంటుందని పరంవీర్ సింగ్ సహానీ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్‌పై విచారణ అనంతరం ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 21వ అధికరణ క్రింద ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలన్న ఉద్దేశంతో ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తున్నామని బెంచ్ వివరించింది.
కోర్టు ఆదేశాలివీ....
వ్యక్తులను సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు నిందితులను గంటల తరబడి తమ కేంద్రాల్లో ఇంటరాగేట్ చేస్తాయి. నిందితులకు సంబంధించిన రాకపోకలు, వారి విచారణ జరిగే ప్రదేశ వివరాలూ రికార్డవ్వాల్సిందే..
దర్యాప్తు సంస్థలు, పోలీస్ స్టేషన్‌లలో ఏ భాగమూ దాచి ఉంచరాదు. అన్ని లాక్‌పలలోనూ, అన్ని కారిడార్లలోనూ, లాబీ, రిసెప్షన్ ప్రాంతాల్లోనూ, వరండా, అవుట్ హౌస్ లలోనూ, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ గదుల్లోను, లాకప్ బయటా, స్టేషన్ హాల్ లోనూ, పోలీస్ స్టేషన్ ఆవరణ ముందు, బయటా, వాష్ రూమ్, శౌచాలయాల్లోనూ, డ్యూటీ అధికారి గదిలోనూ, పోలీస్ స్టేషన్ వెనుక ప్రాంతంలోనూ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
సీసీటీవీ వ్యవస్థల్లో రాత్రి పూట కనిపించే కెమెరాలను కూడా నెలకొల్పాలి. ఆడియో, వీడియో రెండూ రికార్డుకావాలి.
సీసీకెమెరా దృశ్యాలను డిజిటల్ వీడియో రికార్డుల్లో భద్రపరచాలి. డాటాను కనీసం 6 నెలలపాటు భద్రపరచాలి.
సీసీటీవీలను పనిచేసేలా, పరిరక్షించేలా చూసే బాధ్యత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోది.
ప్రతి రాష్ట్రానికి చెందిన డీజీపీ, ఐజీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిలతో ఎప్పటికపుడు కెమెరాల పనితీరును సమీక్షించాలి.
సీసీటీవీ నిఘాలో ఉంది అన్న బోర్డులను నెలకొల్పాలి.
కేంద్రీకృత పర్యవేక్షక వ్యవస్థ(సీవోబీ), రాష్ట్రస్థాయి పర్యవేక్షక కమిటీల(ఎ్‌సఎల్‌ఓసీ) ఏర్పాటుపై అఫిడవిట్ ఇవ్వాలి.