కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు బీభత్సం

ABN , First Publish Date - 2020-08-20T18:56:14+05:30 IST

కాలిఫోర్నియా అడవులను కార్చిచ్చు కబలిస్తోంది.

కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు బీభత్సం

కాలిఫోర్నియా అడవులను కార్చిచ్చు కబలిస్తోంది. పొడి వాతావరణం, బలమైన గాలులు తోడవడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్ని కిలలు ఇప్పటికే వందలాది ఎకరాల్లో అటవి సంపదను దగ్ధం చేసింది. అడవిలో రేగిన మంటలతో శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో వేలాదిమందిని అధికారులు ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కార్చిచ్చు కారణంగా 50 ఇళ్లు దగ్ధమయ్యాయి. దాదాపు 367 చోట్ల అగ్ని కిలలు విస్తరించడంతో వాటిని ఆర్పిందుకు భారీ విమానాలను వినియోగిస్తున్నారు. మరోవైపు సెంట్రల్ కాలిఫోర్నియా అడవుల్లో రేగిన కార్చిచ్చును ఆర్పబోయిన హెలీకాఫ్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోవడంతో ఫైలట్ మృతి చెందారు.

Updated Date - 2020-08-20T18:56:14+05:30 IST