సీఏఏతో హక్కులను హరించం: కేంద్రం

ABN , First Publish Date - 2020-03-18T07:39:05+05:30 IST

సీఏఏతో పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను ప్రశ్ని స్తూ సుప్రీంకోర్టులో వందకుపైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

సీఏఏతో హక్కులను హరించం: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 17: సీఏఏతో పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను ప్రశ్ని స్తూ సుప్రీంకోర్టులో వందకుపైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ డైరెక్టర్‌ బీసీ జోషి మంగళవారం 129 పేజీల అఫిడవిట్‌ దాఖలు చేశారు. సీఏఏ ద్వారా సర్కారుకు నిరంకుశ, అసాధారణ అధికారాలు ఏవీ సంక్రమించవని తెలిపింది. సీఏఏపై దాఖలైన వ్యాజ్యాలను నిరుడు డిసెంబరు 18న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం దీని అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.   

Updated Date - 2020-03-18T07:39:05+05:30 IST