ఆగని సీఏఏ నిరసనలు

ABN , First Publish Date - 2020-03-19T10:40:14+05:30 IST

ఆగని సీఏఏ నిరసనలు

ఆగని సీఏఏ నిరసనలు

చెన్నై, మార్చి 18: కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ప్రజల నుంచి సహకారం కొరవడుతోంది. భారీ సభలు, నిరసనలపై నిషేధం అమలులో ఉన్నా లెక్కచేయడం లేదు. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం చెన్నై మెరీనా బీచ్‌ సమీపంలోని చెపాక్‌ స్టేడియం వద్ద 5వేల మందికి పైగా ఒకేచోట గుమికూడి ఆందోళన నిర్వహించారు. చెన్నైతో పాటు తమిళనాడు వ్యాప్తంగా ప లు జిల్లాల్లోనూ తౌహీత్‌ జమత్‌ సభ్యులు నిరసనలు చేపట్టారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిసి కూడా ప్రభుత్వ సూచనలు ధిక్కరిస్తూ సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పెద్దసంఖ్యలో జనం పాల్గొనడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-03-19T10:40:14+05:30 IST