టిక్‌టాక్‌ ఒప్పందం ఖరారుకు బైట్‌డ్యాన్స్‌ కసరత్తు

ABN , First Publish Date - 2020-09-25T08:12:08+05:30 IST

పాపులర్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ అమెరికాలో కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తున్న నేపథ్యంలో ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌తో డీల్‌ను పూర్తి చేయాలనుకుంటోంది...

టిక్‌టాక్‌ ఒప్పందం ఖరారుకు బైట్‌డ్యాన్స్‌ కసరత్తు

బీజింగ్‌, సెప్టెంబరు 24: పాపులర్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ అమెరికాలో కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తున్న నేపథ్యంలో ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌తో డీల్‌ను పూర్తి చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనీస్‌ టెక్నాలజీ ఎగుమతి లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసింది. అమెరి కా కంపెనీలకు టిక్‌టాక్‌ను విక్రయించాలని అగ్రరాజ్యం నుంచి ఆదేశాలు వ చ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన చైనా.. టెక్నాలజీ ఎగుమతులపై నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది. అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్నం దున ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌లతో ఒప్పందానికి టిక్‌టాక్‌ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తు చేసినట్టు బైట్‌డ్యాన్స్‌ తెలిపింది.

Updated Date - 2020-09-25T08:12:08+05:30 IST