చీర కొంటే మాస్క్‌, హోమియోప‌తి ఔష‌ధం, ఫేస్ షీల్డ్ ఫ్రీ!

ABN , First Publish Date - 2020-06-18T12:56:09+05:30 IST

దీర్ఘకాలిక లాక్‌డౌన్ స‌డ‌లింపుల అనంత‌రం దేశం నెమ్మదిగా గాడిలో ప‌డుతోంది. అయితే కరోనా వ్యాప్తి అంత‌కంత‌కు విజృంభిస్తోంది. ఈ నేప‌ధ్యంలో...

చీర కొంటే మాస్క్‌, హోమియోప‌తి ఔష‌ధం, ఫేస్ షీల్డ్ ఫ్రీ!

సూర‌త్‌: దీర్ఘకాలిక లాక్‌డౌన్ స‌డ‌లింపుల అనంత‌రం దేశం నెమ్మదిగా గాడిలో ప‌డుతోంది. అయితే కరోనా వ్యాప్తి అంత‌కంత‌కు విజృంభిస్తోంది. ఈ నేప‌ధ్యంలో గుజ‌రాత్‌కు చెందిన వ‌స్త్ర‌వ్యాపారులు త‌మ విక్ర‌యాలు వృద్ధి చెందేందుకు, క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు నూత‌న పంథాను ఎన్నుకున్నారు. ఈ మేర‌కు చీర‌లు, ఇత‌ర దుస్తుల‌పై వివిధ ర‌కాల ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టారు. ఒక వ‌స్త్ర వ్యాపార సంస్థ యాంటీ క‌రోనా ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కంలో భాగంగా ప్ర‌తీ చీర కొనుగోలుతో పాటు మాస్కు, హోమియోప‌తి ఔష‌ధం, ఫేస్ షీల్డ్ అంద‌జేస్తున్నారు. సూర‌త్‌కు చెందిన వ్యాపారవేత్త గోవింద్ ఒమర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక ప్యాకింగ్‌తో‌ రిటైల్ వ్యాపారులకు చీరలను సరఫరా చేయ‌నున్నామ‌ని తెలిపారు. ఈ విధానాన్ని వ‌స్త్ర విక్రేత‌లంతా కూడా అమ‌లుచేస్తే క‌రోనాను త‌రిమికొట్ట‌గ‌ల‌మ‌ని గోవింద్ పేర్కొన్నారు.  

Updated Date - 2020-06-18T12:56:09+05:30 IST