ట్రావెల్ హిస్టరీ లేదు..బయటకు వెళ్లిందేలేదు...అయినా కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-07T11:52:53+05:30 IST

గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో 55 ఏళ్ల వ్యాపారవేత్తకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ జోన్ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ తేజస్ షా తెలిపారు. లాక్డౌన్లో చిక్కుకున్న ...

ట్రావెల్ హిస్టరీ లేదు..బయటకు వెళ్లిందేలేదు...అయినా కరోనా పాజిటివ్

అహ్మదాబాద్‌: గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో 55 ఏళ్ల వ్యాపారవేత్తకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ జోన్ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ తేజస్ షా తెలిపారు. లాక్డౌన్లో చిక్కుకున్న వారికి బాధితుడు ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నాడు. కాగా ఇతనికి కరోనా  ఎలా సోకిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ వ్యాపారవేత్త చాలా కాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. పైగా ఇతనికి ట్రావెల్ హిస్టరీ కూడా లేదు. అయితే ఇప్పుడు అతనికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో వైద్యులు ఇందుకుగల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే  అతని కుటుంబానికి చెందిన 13  మందినికూడా వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. 

Read more