త్రిశూలం కొండపై కార్చిచ్చు
ABN , First Publish Date - 2020-02-08T16:16:51+05:30 IST
స్థానిక పల్లావరం ప్రాంతం మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్ ఎదురుగా ఉన్న త్రిశూలం కొండపై శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆ కొండపై నుంచి

చెన్నై(ఆంధ్రజ్యోతి): స్థానిక పల్లావరం ప్రాంతం మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్ ఎదురుగా ఉన్న త్రిశూలం కొండపై శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆ కొండపై నుంచి దట్టమైనపొగలు నలువైపులా వ్యాపించాయి. దీంతో ఆ కొండ దిగువ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఆందోళన చెందారు. ఆ కొండపై మేకలు మేపేందుకు వెళ్లినవారెవరైనా ఎండిన చెట్లపై కాల్చిన బీడీ వేయడంతో ఈ మంటలు చెలరేగి ఉంటాయని అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళం సభ్యుల కొండెక్కేందుకు ప్రయత్నించారు. కాని ప్రమాద స్థలానికి చేరు కోలేకపోయారు. గంటకు పైగా మంటలు చెలరేగిన తర్వాత ఆరిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.