బస్సు-లారీ ఢీ: 12 మంది వలసకార్మికులకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-05-18T11:13:34+05:30 IST

వేగంగా వస్తున్న ఓ లారీ బస్సును ఢీకొన్న ఘటనలో 12 మంది వలసకార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటన...

బస్సు-లారీ ఢీ: 12 మంది వలసకార్మికులకు తీవ్ర గాయాలు

ఖుషీనగర్(బీహార్): వేగంగా వస్తున్న ఓ లారీ బస్సును ఢీకొన్న ఘటనలో 12 మంది వలసకార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటన బీహార్ రాష్ట్రంలోని ఖుషీనగర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగింది. లాక్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలసకార్మికులు ఆదివారం రాత్రి బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ కు బస్సులో వస్తుండగా పధర్వా వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది వలసకార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గోరఖ్ పూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, వైద్యసిబ్బంది వచ్చి గాయపడిన వలసకార్మికులను ఆదుకున్నారు. 

Updated Date - 2020-05-18T11:13:34+05:30 IST