అండర్‌ బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టి రెండుగా చీలిన బస్సు!

ABN , First Publish Date - 2020-12-11T05:20:58+05:30 IST

వేగంగా వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జి కింద పిల్లర్‌ను ఢీకొట్టి రెండుగా చీలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ అందులో ప్రయాణికులెవరూ...

అండర్‌ బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టి రెండుగా చీలిన బస్సు!

అహ్మదాబాద్: వేగంగా వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జి కింద పిల్లర్‌ను ఢీకొట్టి రెండుగా చీలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ అందులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్)కి చెందిన బస్సు అక్బర్‌నగర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్టు సంస్థకు చెందిన అహ్మదాబాద్ జనరల్ మేనేజర్ విశాల్ ఖనమా పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణీకులెవరూ లేరని తెలిపారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో ఉన్న డ్రైవర్, సూపర్‌వైజర్‌లకు మాత్రం గాయాలయ్యాయనీ.. ప్రస్తుతం ఇరువురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని జీఎం పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-11T05:20:58+05:30 IST