పశ్చిమ బెంగాల్ వలస కూలీల బస్సు బోల్తా... ఏడుగురికి గాయాలు...

ABN , First Publish Date - 2020-05-30T22:17:12+05:30 IST

కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న వలస కూలీల బస్సు ఒడిశాలోని

పశ్చిమ బెంగాల్ వలస కూలీల బస్సు బోల్తా... ఏడుగురికి గాయాలు...

బాలాసోర్ : కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న వలస కూలీల బస్సు ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. 


పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం  కేరళ వెళ్ళిన వలస కూలీలు దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల ఉపాధి కోల్పోయారు. దీంతో వీరు తమ స్వస్థలాలకు వెళ్ళిపోవడానికి ఈ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యంలో శనివారం బాలాసోర్ పట్టణం సమీపంలో 16వ జాతీయ రహదారిపై ఈ బస్సు బోల్తా పడింది. 


కోల్‌కతా వెళ్తున్న ఈ బస్సులో 38 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సహకారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను కాపాడినట్లు తెలిపారు. గాయపడినవారిని బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 


మిగిలిన ప్రయాణికులను తాత్కాలిక శిబిరంలో ఉంచినట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఈ ప్రయాణికులంతా కోవిడ్-19 నిబంధనలను, భౌతిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వీరిని వేరొక బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2020-05-30T22:17:12+05:30 IST