తైవాన్‌లో భూకంపం...కంపించిన భవనాలు
ABN , First Publish Date - 2020-12-11T12:23:34+05:30 IST
తైవాన్ దేశంలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది....
తైపీ (తైవాన్): తైవాన్ దేశంలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. ఉత్తర తైవాన్ దేశంలో గురువారం సంభవించిన భూకంపం వల్ల భారీ భవనాలు ప్రకంపించాయి. తైవాన్ దేశంలో సంభవించిన భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. తైవాన్ దేశంలోని ఈశాన్య తీరంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని సెంట్రల్ వెదర్ బ్యూరో తెలిపింది.భూకంపం వల్ల తైపీ నగరంలోని ప్రభుత్వ సబ్ వే వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం లేదని, అది సాధారణంగా పనిచేసిందని తైపీ నగర అధికారులు చెప్పారు. 2016లో దక్షిణ తైవాన్ లో సంభవించిన భూకంపంలో వందమందికి పైగా మరణించారు. 1999లో తైవాన్ లో సంభవించిన 7.3 భూకంపం తీవ్రత కారణంగా 2వేలమంది ప్రాణాలు కోల్పోయారు. తైవాన్ దేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. భూమి కంపించడంతో తైపీ నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.