పది.. అంత కంటే ఎక్కువ కరోనా కేసులుంటే బిల్డింగ్‌కు సీల్!

ABN , First Publish Date - 2020-09-17T20:26:05+05:30 IST

ఒకటి లేదా రెండు అంతస్తుల్లో పది కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైతే అటువంటి భవంతి మూసివేస్తామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు కరోనా మార్గదర్శకాల్లో ప్రభుత్వం మంగళవారం నాడు మార్పులు చేసింది. అయితే.. ఓ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదైతే ఆ భవంతిని పాక్షికంగా సీల్ చేస్తామని తెలిపింది.

పది.. అంత కంటే ఎక్కువ కరోనా కేసులుంటే బిల్డింగ్‌కు సీల్!

ముంబై: ఒకటి లేదా రెండు అంతస్తుల్లో పది కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైతే అటువంటి భవంతి మూసివేస్తామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు కరోనా మార్గదర్శకాల్లో ప్రభుత్వం మంగళవారం నాడు మార్పులు చేసింది. అయితే.. ఓ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదైతే ఆ భవంతిని పాక్షికంగా సీల్ చేస్తామని తెలిపింది. 


గతంలో కేసులు వెలుగు చూసిన అంతస్తు మాత్రమే సీల్ చేస్తానని చెప్పిన మున్సిపల్ కార్పొరేషన్.. కరోనా కట్టడి కోసం ఈ మేరకు మార్పులు చేసి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. భవంతి మూసివేసే విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారాలను అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ లేదా మెడికల్ హెల్త్ ఆఫీసర్‌కు దఖలు పరిచింది. 


ఇక మంగళవారం నాడు ముంబైలో కొత్తగా 1,585 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో సీల్ చేసిన భవంతుల సంఖ్య కూడా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం..ముంబైలో ఇప్పటివరకూ 8763 భవంతులను అధికారులు సీల్ చేశారు. 

Updated Date - 2020-09-17T20:26:05+05:30 IST