అయోధ్యలో మొదలైన ఆలయ నిర్మాణ ప్రక్రియ

ABN , First Publish Date - 2020-03-02T08:05:53+05:30 IST

అయోధ్యలో ఆలయ నిర్మాణ ప్రక్రియ మొదలైంది. 67.7 ఎకరాల విస్తీర్ణంలోని ‘రామ జన్మభూమి’లో స్థలం చదును చేసే కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఇందుకోసం భారీ...

అయోధ్యలో మొదలైన ఆలయ నిర్మాణ ప్రక్రియ

అయోధ్య, మార్చి 1: అయోధ్యలో ఆలయ నిర్మాణ ప్రక్రియ మొదలైంది. 67.7 ఎకరాల విస్తీర్ణంలోని ‘రామ జన్మభూమి’లో స్థలం చదును చేసే కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఇందుకోసం భారీ ‘ఎర్త్‌ మూవింగ్‌’ యంత్రా లు అక్కడకు చేరుకున్నాయి. తాత్కాలిక ఆలయంలోని ‘రామ్‌లల్లా’ విగ్రహాలను 150మీటర్ల దూరంలోని మనాస్‌ భవన్‌కు తరలించారు. అక్కడ ‘బుల్లెట్‌ ప్రూఫ్‌ ఫైబర్‌’తో నిర్మించిన ఓ గదిలో ఉంచారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు విగ్రహాలు అక్కడే ఉంటాయని తాత్కాలిక ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యానంద దాస్‌ చెప్పారు. 2024 ఎన్నికల నాటికి ఆలయ ప్రాథమిక నిర్మాణ దశను పూర్తి చేస్తామని రామ జన్మభూమి న్యాస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రామ్‌ విలాస్‌ వేదాంతి చెప్పారు.

Updated Date - 2020-03-02T08:05:53+05:30 IST