కూలిన మూడంతస్తుల భవనం
ABN , First Publish Date - 2020-02-08T23:03:42+05:30 IST
మొహాలీలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు.

పంజాబ్: మొహాలీలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. శిథిలాల చిక్కుకున్న ఇద్దరిని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రక్కనే ఉన్న భూమిని చదును చేసే క్రమంలో జేసిబీ ఈ భవనం గోడలను తాకడంతో భవనం కూలింది.