ఆస్పత్రిలో చేరిన బుద్ధదేవ్
ABN , First Publish Date - 2020-12-10T07:24:06+05:30 IST
సీపీఎం వృద్ధనేత, బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యను బుధవారం కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

కోల్‌కతా, డిసెంబరు 9: సీపీఎం వృద్ధనేత, బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యను బుధవారం కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. తమ ఫ్లూ క్లినిక్‌లో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి అధికారి ఒకరు చెప్పారు. పరీక్షలు చేసిన తరువాత ఆయనను ఆస్పత్రిలో ఉంచాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామన్నారు.
2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన కొద్దికాలంగా శ్వాస సంబంధమైన సమస్యలు, వృద్ధాప్య వ్యాధులతో బాధపడుతున్నారు.