గుజరాత్‌లో ఎంఐఎంతో చేతులు కలిపేందకు సరేనన్న బీటీపీ!

ABN , First Publish Date - 2020-12-30T12:02:12+05:30 IST

గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో చేతులు కలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈసారి ఎన్నికలకు కలిసే వెళ్తామని భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) పేర్కొంది.

గుజరాత్‌లో ఎంఐఎంతో చేతులు కలిపేందకు సరేనన్న బీటీపీ!

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో చేతులు కలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈసారి ఎన్నికలకు కలిసే వెళ్తామని భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) పేర్కొంది. గుజరాత్‌లో ఈ ఎన్నికల వేళ ఎంఐఎంతో కలిసే పోటీ చేయబోతున్నామని ఎంఐఎం నేత, ఎంపీ ఇంతియాజ్ జలీల్ తెలిపారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాకు ప్రస్తుతానికి గుజరాత్ రాష్ట్రంలో పార్టీ యూనిట్ లేదు. కానీ అహ్మదాబాద్, భారుచ్ తదితర ప్రాంతాల్లో ఎంఐఎం వర్కర్లు మా వెంటే ఉండి పని చేస్తున్నారు’’ అని జలీల్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-30T12:02:12+05:30 IST