బీఎస్ఎఫ్‌లో మరో 18 మందికి సోకిన కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-05-11T02:29:35+05:30 IST

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్‌)లో నేడు కొత్తగా మరో 18 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం కేసుల

బీఎస్ఎఫ్‌లో మరో 18 మందికి సోకిన కరోనా వైరస్

న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్‌)లో నేడు కొత్తగా మరో 18 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 276కు పెరిగింది. నేడు వెలుగు చూసిన 18 కేసుల్లో 16 త్రిపురలో గుర్తించగా, రెండు ఢిల్లీలో బయటపడినట్టు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ నెల 8న 30 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు. వీటిలో ఆరు కేసులు ఢిల్లీలో నమోదు కాగా, 24 త్రిపురలో వెలుగుచూశాయి.


Updated Date - 2020-05-11T02:29:35+05:30 IST