మణిపూర్ లో కరోనాతో బీఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి

ABN , First Publish Date - 2020-08-17T02:22:38+05:30 IST

మణిపూర్ లో కరోనాతో బీఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి

మణిపూర్ లో కరోనాతో బీఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి

ఇంపాల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. 44 ఏళ్ల బీఎస్‌ఎఫ్ సిబ్బంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, న్యుమోనియాతోపాటు కోవిడ్ -19తో ప్రభుత్వ రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు అధికారి తెలిపారు. మణిపూర్‌లో 14 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది కరోనా వల్ల మృతి చెందారని వైద్య అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-08-17T02:22:38+05:30 IST