జమ్ములో చొరబాటుయత్నం భగ్నం

ABN , First Publish Date - 2020-09-21T08:41:59+05:30 IST

జమ్ము ప్రాంతంలోకి చొరబడేందుకు దుండగులు చేసిన యత్నాన్ని బీఎ్‌సఎఫ్‌ బలగాలు భగ్నం చేశాయి. శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్‌ నుంచి ముగ్గురు వ్యక్తులు ఆర్‌ఎస్‌ పుర సెక్టార్‌ వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు యత్నిస్తుండగా వారిని వారించేందుకు ప్రయత్నించగా...

జమ్ములో చొరబాటుయత్నం భగ్నం

జమ్ము, సెప్టెంబరు 20: జమ్ము ప్రాంతంలోకి చొరబడేందుకు దుండగులు చేసిన యత్నాన్ని బీఎ్‌సఎఫ్‌ బలగాలు భగ్నం చేశాయి. శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్‌ నుంచి ముగ్గురు వ్యక్తులు ఆర్‌ఎస్‌ పుర సెక్టార్‌ వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు యత్నిస్తుండగా వారిని వారించేందుకు ప్రయత్నించగా దుండగులు బలగాల వైపు కాల్పులు జరిపి  పారిపోయారు. అక్కడ లభించిన 62 కిలోల మాదకద్రవ్యాల పాకెట్లు, రెండు చైనా పిస్టళ్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-09-21T08:41:59+05:30 IST