బీఎస్‌ఎఫ్ క్యాంపులు తొలగించండి
ABN , First Publish Date - 2020-12-28T08:44:31+05:30 IST
ఛత్తీ్‌సగఢ్‌లో నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలోని కాట్‌గావ్, కామ్‌టేడా గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసిన రెండు సరిహద్దు భదత్రా దళం(బీఎ్‌సఎఫ్) శిబిరాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు...

- ఛత్తీ్‌సగఢ్‌లో 55 మంది పంచాయత్ ప్రతినిధుల రాజీనామా
రాయ్‌పూర్, డిసెంబరు 27: ఛత్తీ్‌సగఢ్‌లో నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలోని కాట్‌గావ్, కామ్‌టేడా గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసిన రెండు సరిహద్దు భదత్రా దళం(బీఎ్‌సఎఫ్) శిబిరాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ గ్రామాలకు సమీపంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భద్రత కల్పించడానికి వ్యూహాత్మక పార్తపూర్-కోయలిబేడా మార్గంలో బీఎ్‌సఎఫ్ శిబిరాలను ఏర్పాటు చేశారు. అయితే క్యాంపులు నెలకొల్పిన ప్రాంతాల్లో కొన్నేళ్లుగా పూజలు చేస్తున్నామని, శిబిరాలను వెంటనే మార్చాలని వందకుపైగా గ్రామాల నుంచి వేలమంది కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు మద్దతుగా 46 మంది సర్పంచులు, ఏడుగురు పంచాయత్ సభ్యులు, డిప్యూటీ సర్పంచి, ఒక జడ్పీటీసీ రాజీనామా చేశారు.