రష్యా అధ్యక్ష పదవికి పుతిన్‌ గుడ్‌బై?

ABN , First Publish Date - 2020-11-07T06:51:02+05:30 IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్నారా? ఆరోగ్య పరిస్థితుల దృష్యా పదవి నుంచి తప్పుకోనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి...

రష్యా అధ్యక్ష పదవికి పుతిన్‌ గుడ్‌బై?

మాస్కో, నవంబరు 6: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్నారా? ఆరోగ్య పరిస్థితుల దృష్యా పదవి నుంచి తప్పుకోనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ది సన్‌ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ పుతిన్‌ ప్రియురాలు అలీనా కబేవా(37), ఇద్దరు కుమార్తెలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మేరకు పుతిన్‌ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేసింది.  

Updated Date - 2020-11-07T06:51:02+05:30 IST