జకీర్ నాయక్ ‘పీస్ టీవీ నెట్‌వర్క్’పై బ్రిటన్‌లో భారీ జరిమానా
ABN , First Publish Date - 2020-05-18T00:30:12+05:30 IST
ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ నేతృత్వంలోని పీస్ టీవీ నెట్‌వర్క్‌పై

లండన్ : ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ నేతృత్వంలోని పీస్ టీవీ నెట్‌వర్క్‌పై బ్రిటన్‌లో మీడియా నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్ భారీ జరిమానా వడ్డించింది. విద్వేషపూరిత, అత్యంత అభ్యంతరకరమైన అంశాలను ప్రసారం చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పీస్ టీవీ ఉర్దూ, పీస్ టీవీ నిబంధనలను ఉల్లంఘించిననట్లు తెలిపింది.
ఆఫ్‌కామ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ నేతృత్వంలోని పీస్ టీవీ నెట్‌వర్క్‌పై భారీ జరిమానా వడ్డించింది. విద్వేషపూరిత, అత్యంత అభ్యంతరకరమైన అంశాలను ప్రసారం చేసినందుకు ఈ ఛానళ్ళ ఫార్మర్ లైసెన్స్ హోల్డర్లపై 3 లక్షల పౌండ్ల జరిమానా విధించింది. పీస్ టీవీ ఉర్దూపై 2 లక్షల పౌండ్ల జరిమానా, పీస్ టీవీపై 1 లక్ష పౌండ్ల జరిమానా విధించింది. టెలివిజన్ ప్రసారాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంది.
ఈ ఛానళ్ళలో ప్రసారమైన కథనాలు అత్యంత అభ్యంతరకంగా ఉన్నట్లు ఆఫ్‌కామ్ తెలిపింది. ఓ సందర్భంలో ఈ టీవీ ఛానళ్ళ ప్రసారాలు నేరాలను ప్రోత్సహించేవిధంగా ఉన్నట్లు తెలిపింది.
ఆఫ్‌కామ్ ప్రసార నిబంధనలను పాటించడంలో తీవ్రంగా విఫలమైనందుకు పీస్ టీవీ, పీస్ టీవీ ఉర్దూ ఫార్మర్ లైసెన్స్ హోల్డర్లపై జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.
లార్డ్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ యాజమాన్యంలో పీస్ టీవీ ఉంది. పీస్ టీవీ ఉర్దూ లైసెన్స్ హోల్డర్ క్లబ్ టీవీ. ఈ రెండు చానళ్ళకు పేరెంట్ కంపెనీ జకీర్ నాయక్ నేతృత్వంలోని యూనివర్సల్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ లిమిటెడ్.
జకీర్ నాయక్‌పై భారత దేశంలో మనీలాండరింగ్ కేసు దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగాలు ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నాయని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన 2016లో భారత దేశాన్ని విడిచి వెళ్ళారు, ప్రస్తుతం ఆయన మలేసియాలో ఉంటున్నారు. మలేసియా ప్రభుత్వం ఆయనకు పర్మినెంట్ రెసిడెన్సీని మంజూరు చేసింది.