బ్రిటన్ రాజ కుటుంబానికి కరోనా కాటు!

ABN , First Publish Date - 2020-03-25T22:06:59+05:30 IST

బ్రిటన్ రాజవంశంలో తొలి కరోనా కేసు నమోదైంది. బ్రిటన్ రాణి తరువాత సింహాసనాన్ని అధిరోహించబోయే ప్రిన్స్ చార్ల్స్‌ కరోనా బారిన పడ్డారు.

బ్రిటన్ రాజ కుటుంబానికి కరోనా కాటు!

లండన్: బ్రిటన్ రాజవంశంలో తొలి కరోనా కేసు నమోదైంది. బ్రిటన్ రాణి తరువాత సింహాసనాన్ని అధిరోహించబోయే ప్రిన్స్ చార్ల్స్‌ కరోనా బారిన పడ్డారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. చార్ల్స్‌లో రోగ లక్షణాలు అంత తీవ్రంగా లేవని, చిన్న చిన్న ఇబ్బందులు మినహా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని క్లెరెస్స్ హౌస్ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేసారు.  ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమయ్యారని తెలిపారు. చార్ల్స్ భార్య కెమిల్లాకు కూడా పరీక్షలు జరపగా వ్యాధి లేదని తేలింది. ఇటీవల చార్ల్స్ అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, కాబట్టి ఏ సందర్భంలో ఆయనకు కరోనా సోకి ఉండచ్చో కచ్చితంగా చెప్పలేమని అధికారులు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు.. భార్య భర్తలిద్దరూ ప్రస్తుతం స్కాట్ ల్యాండ్‌లో సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉన్నారని సమచారం. ఈ విషయంలో మరింత సమాచారం రావాల్సి ఉంది.  



Updated Date - 2020-03-25T22:06:59+05:30 IST