యాంటీబాడీ సూపర్‌మ్యాన్‌

ABN , First Publish Date - 2020-06-04T07:10:52+05:30 IST

కరోనా సంక్షోభంతో చిగురుటాకులా వణుకుతున్న బ్రిటన్‌లో ఇప్పుడంతా ఓ వ్యక్తిని ‘యాంటీబాడీ సూపర్‌మ్యాన్‌’ అని పిలుస్తున్నారు. ఆయన అసలు పేరు డాక్టర్‌ అలెసాండ్రో గియార్డిని. వయ సు 46 ఏళ్లు. బ్రిటన్‌లోని గ్రేట్‌ ఆర్మండ్‌ స్ట్రీట్‌ ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణుడు...

యాంటీబాడీ సూపర్‌మ్యాన్‌

  • బ్రిటన్‌ వైద్యుడి ప్లాస్మాలో 40 రెట్లు ఎక్కువ యాంటీబాడీలు


కరోనా సంక్షోభంతో చిగురుటాకులా వణుకుతున్న బ్రిటన్‌లో ఇప్పుడంతా ఓ వ్యక్తిని ‘యాంటీబాడీ సూపర్‌మ్యాన్‌’ అని పిలుస్తున్నారు. ఆయన అసలు పేరు డాక్టర్‌ అలెసాండ్రో గియార్డిని. వయ సు 46 ఏళ్లు. బ్రిటన్‌లోని గ్రేట్‌ ఆర్మండ్‌ స్ట్రీట్‌ ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణుడు. ఇంతకీ ఆయనకు ‘యాంటీబాడీ సూపర్‌మ్యాన్‌’ అనే పేరు ఎందుకొచ్చింది? అనుకుంటున్నారా!! ఇంతకుముందు ఆయనకు కరోనా ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా సోకింది. అదృష్టవశాత్తు అందుబాటులో ఉన్న మందులు పనిచేసి ఆయన ప్రాణాలతో గట్టెక్కారు. అనంతరం ఎంతోమంది కరోనా రోగుల చికిత్సకు తన ప్లాస్మాను దానం చేశారు. డాక్టర్‌ గియార్డిని ప్లాస్మాలో బ్రిటన్‌లో కరోనా నుంచి కోలుకున్న మరే వ్యక్తిలోనూ గుర్తించనంత ఎక్కువ సంఖ్యలో(40 రెట్లు ఎక్కువ) యాంటీబాడీలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 


Updated Date - 2020-06-04T07:10:52+05:30 IST