కొవిడ్‌ చికిత్సకు డెక్సామెథసోన్‌.. బ్రిటన్‌ ఆమోదం

ABN , First Publish Date - 2020-06-18T07:47:08+05:30 IST

కరోనా మరణాల రేటును మూడో వంతుకు తగ్గించేందుకు ఉపయోగపడుతున్న స్టెరాయిడ్‌ ‘డెక్సామెథసోన్‌’ వాడకానికి బ్రిటన్‌ పచ్చజెండా ఊపింది. ఆక్సిజన్‌ అవసరమైన, వెంటిలేటర్‌పై ఉన్న కొవిడ్‌ రోగులకు ఆ ఔషధాన్ని...

కొవిడ్‌ చికిత్సకు డెక్సామెథసోన్‌.. బ్రిటన్‌ ఆమోదం

లండన్‌, జూన్‌ 17: కరోనా మరణాల రేటును మూడో వంతుకు తగ్గించేందుకు ఉపయోగపడుతున్న స్టెరాయిడ్‌ ‘డెక్సామెథసోన్‌’ వాడకానికి బ్రిటన్‌ పచ్చజెండా ఊపింది. ఆక్సిజన్‌ అవసరమైన, వెంటిలేటర్‌పై ఉన్న కొవిడ్‌ రోగులకు ఆ ఔషధాన్ని అందించవచ్చని నేషనల్‌ హెల్త్‌ సర్వీ్‌స (ఎన్‌హెచ్‌ఎస్‌) విభాగానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. స్థానిక అవసరాల రీత్యా ఆ మందును ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం లేకుండా నిషేధం విధించింది.  


Updated Date - 2020-06-18T07:47:08+05:30 IST