కరోనా పిచ్చిని వదిలి పనుల్లోకి వెళ్లండి.. అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్య

ABN , First Publish Date - 2020-03-25T20:09:45+05:30 IST

బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ఓ వివాదాస్పద చేశారు. కరోనా పిచ్చిన కాస్త పక్కన పెట్టి దేశప్రజలందరూ సాధారణ స్థితికి వెళ్లాలని సూచించారు.

కరోనా పిచ్చిని వదిలి పనుల్లోకి వెళ్లండి.. అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్య

బ్రెజీలియా: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు బ్రిజెల్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ దేశంలోని రాష్ట్రాలు, నగరాలు ఒక్కొకటిగా లాక్ డౌన్ లోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతిని ఉద్దేశించి బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ఓ వివాదాస్పద చేశారు. దేశ ప్రజలందరూ కరోనా పిచ్చిని పక్కన పెట్టి సాధారణ స్థితికి వెళ్లాలని సూచించారు. ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్న రాష్ట్రాలు, నగరాలు ఈ విధానాలను విడనాడాలని సూచించారు. ఇటలీలో చూస్తున్న పరిస్థితులు బ్రెజిల్‌లో రాబోవని, జనాభాలో అధిక శాతం మంది యువతకావడమే ఇందుకు కారణమని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అనవసర ఆందోళన విడిచిపెట్టి పనుల్లోకి దిగాలన్నారు. అయితే ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. పళ్లేలు మోగిస్తున్న తమ నిరసన గళాన్ని వినిపిచ్చారు. కాగా..కరోనా ప్రమాదం ఉరుముతున్న కూడా ఏం కాదులే అనే తీరులో మాట్లాడుతున్న అధ్యక్షుడి పట్ల గత కొంత కాలంగా ప్రజలు కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పాపులారీటి క్రమంగా తగ్గుతున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 


Updated Date - 2020-03-25T20:09:45+05:30 IST