బ్రెజిల్‌పై మృత్యు పంజా
ABN , First Publish Date - 2020-05-24T07:29:10+05:30 IST
కొవిడ్ కోరల్లో చిక్కుకొన్న బ్రెజిల్.. కేసుల్లో రెండోస్థానంలో ఉన్న రష్యానూ దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటికి బ్రెజిల్లో 3,30,890 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 1001 మంది చనిపోయారు...

వాషింగ్టన్, మే 23 : కొవిడ్ కోరల్లో చిక్కుకొన్న బ్రెజిల్.. కేసుల్లో రెండోస్థానంలో ఉన్న రష్యానూ దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటికి బ్రెజిల్లో 3,30,890 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 1001 మంది చనిపోయారు. అమెరికా తరువాత అంత తీవ్రస్థాయిలో కేసులు ఇప్పుడు రష్యాలోనూ, ఆ తరువాత బ్రెజిల్‌లోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. రష్యాలో కొవిడ్‌పై పోరులో భాగంగా వైద్యులు కొన్ని వారాలు, నెలలపాటు కూడా ఆస్పత్రిలోనే గడిపేస్తున్నారు. వారం క్రితం దాకా రష్యాలో రోజుకు పదివేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో పరిస్థితి మరింత ఘోరం! ఇక్కడ అత్యధికంగా 98 వేలమంది చనిపోగా, 16 లక్షల కొవిడ్ కేసులు బయటపడ్డాయి. కొన్ని ప్రాంతాలు లాక్డౌన్ ఎత్తేసి పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేశాయి. అయితే, ఈ వేగం చాలదని వెనువెంటనే దేశమంతా ఆర్థిక, వ్యాపార రంగాలను తెరవాలని అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నారు.
బ్రెజిల్లో ఇప్పటిదాకా 21 వేల మంది చనిపోయినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. మృతులు ఇంకా ఎక్కువే ఉండొచ్చునని నిపుణులు అనుమానిస్తున్నారు.లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు అవసరమనే చర్చ కొన్నిరోజులుగా జరుగుతోంది. ఇక ఆ ఆలోచనపై అక్కడ పునరాలోచన మొదలయింది.
చైనాలో కేసులు శూన్యం
చైనాలో శనివారం ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. లక్షణాలు లేకుండా 28 కేసులు వూహాన్లో బయటపడ్డాయి. రంజాన్ మాసమంతా సడలింపులు ఇచ్చిన టర్కీ.. తిరిగి లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. యెమెన్‌లో హైతీ తీవ్రవాదులు తమ మద్దతుదారులకు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. జర్మనీలో రెస్టారెంట్‌కు వెళ్లిన ఏడుగురిలో వ్యాధి లక్షణాలను గుర్తించారు. జపాన్ చిన్నచిన్నగా కట్టడిని సడలిస్తోంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో తాజాగా 23 కేసులు నమోదయ్యాయి. సింగపూర్‌లో 642మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. మొత్తం కేసులు 31,068కు చేరుకున్నాయి.