బ్రెజిల్‌లో 50 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-10-08T23:03:21+05:30 IST

బ్రెజిల్‌లో 50 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదు

బ్రెజిల్‌లో 50 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదు

బ్రసిలియా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బ్రెజిల్ కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 31,553 కరోనా కేసులు నమోదైనట్లు బ్రెజిల్ ప్రభుత్వం పేర్కొంది. మొత్తం కరోనా వైరస్ కేసులు 50,00,694 కు పెరిగాయి. యూఎస్, భారతదేశం తర్వాత 50 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన మూడవ దేశంగా బ్రెజిల్ నిలిచింది. దేశంలో కోవిడ్-19 మరణాల సంఖ్య 1,48,228 కు పెరిగింది. యూఎస్ తరువాత బ్రెజిల్ రెండవ అత్యధిక కోవిడ్-19 మరణాల సంఖ్యను నివేదించింది.

Updated Date - 2020-10-08T23:03:21+05:30 IST