ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ సర్జరీ
ABN , First Publish Date - 2020-08-11T06:56:52+05:30 IST
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ప్రకటించారు. ఇతర ఆరోగ్య కారణాలపై ఢిల్లీలో సైన్యానికి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి వెళ్లగా...

- మెదడుకు వెళ్లే నాళాల్లో గడ్డకట్టిన రక్తం
- ఆర్మీ ఆస్పతిలో ఆపరేషన్.. వెంటిలేటర్‌పై దాదా
- అంతకుముందు పరీక్షలో కరోనా పాజిటివ్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ప్రకటించారు. ఇతర ఆరోగ్య కారణాలపై ఢిల్లీలో సైన్యానికి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి వెళ్లగా.. వైరస్ నిర్ధారణ అయిందని తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలంటూ సందేశాలు విడుదల చేశారు. కాగా, మెదడు రక్త నాళాల్లో గడ్డ (క్లాట్) ఉండటంతో ప్రణబ్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ విజయవంతమైందని.. ప్రణబ్ కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.