గగనతలం నుంచి లక్ష్యాన్ని ఛేదించిన ‘బ్రహ్మోస్’
ABN , First Publish Date - 2020-10-31T07:35:04+05:30 IST
గగన తలం నుంచి లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత వైమానిక

న్యూఢిల్లీ, అక్టోబరు 30: గగన తలం నుంచి లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత వైమానిక దళం శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు పంజాబ్‌లోని హల్వారా వైమానిక స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా ఈ క్షిపణిని సంధించారు.
అది తన నిర్దేశిత లక్ష్యమైన బంగాళాఖాతంలోని ఓ నౌకను ధ్వంసం చేసింది. ఈక్రమంలో మార్గం మధ్యలో సుఖోయ్ విమానం గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంది. గగనతలం నుంచి బ్రహ్మో్‌సను పరీక్షించడం ఇది రెండోసారి.