బ్రహ్మోస్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

ABN , First Publish Date - 2020-12-01T22:22:57+05:30 IST

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ నావల్ వెర్షన్‌ను భారత నావికా దళం విజయవంతంగా ప్రయోగించింది. త్రివిధ దళాలు...

బ్రహ్మోస్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ నావల్ వెర్షన్‌ను భారత నావికా దళం విజయవంతంగా ప్రయోగించింది. త్రివిధ దళాలు చేపడుతున్న వరుస ప్రయోగాల్లో భాగంగా ఇవాళ బంగాళాఖాతంలో ఈ ప్రయోగం చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. గత ఆరు వారాల క్రితం అరేబియన్ సముద్రంలో కూడా భారత నావికాదళం ఇదే తరహా క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. జలాంతర్గాములు, ఓడలు, విమానాలు సహా భూ ఉపరితలం నుంచి ప్రయోగించగల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ తయారు చేస్తోంది. ఈ నెల 24న భారత ఆర్మీ ధ్వని వేగానికి మూడురెట్ల వేగంతో ఉపరితల లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. కాగా ఉపరితలం నుంచి ప్రయోగించగల నూతన మిసైల్ వెర్షన్ సామర్థ్యాన్ని 290 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లకు విజయవంతంగా విస్తరించారు. వాస్తవాధీన రేఖ పొడవునా లద్దాక్, అరుణాచల్ ప్రదేశ్ సహా చైనా కాలుదువ్వుతున్న పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో భారత్ ఇప్పటికే భారీగా బ్రహ్మోస్ మిసైళ్లు సహా ఇతర కీలక ఆయుధ సంపత్తిని మోహరించింది. Updated Date - 2020-12-01T22:22:57+05:30 IST