‘మోదీజీ... మీ 5 గంటల వీడియోను చూపించండి’: మాజీ బాక్సర్ వినతి

ABN , First Publish Date - 2020-03-23T14:12:16+05:30 IST

కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 5 నిముషాలపాటు ప్రజలంతా చప్పట్లు కొట్టారు. ఈ నేపధ్యంలో...

‘మోదీజీ... మీ 5 గంటల వీడియోను చూపించండి’: మాజీ బాక్సర్ వినతి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 5 నిముషాలపాటు ప్రజలంతా చప్పట్లు కొట్టారు. ఈ నేపధ్యంలో మాజీ బాక్సర్, ఒలిపింక్ కాంశ్యపతక విజేత విజేందర్ సింగ్ ఒక ప్రశ్నలేవనెత్తారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై దక్షిణ ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన విజేందర్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘సర్ నరేంద్ర మోదీ, మీరు దయచేసి మీ వీడియోను అప్‌లోడ్ చేయండి. మీరు 5 గంటల సమయంలో చప్పట్లు కొట్టడాన్ని మేమంతా చూడాలనుకుంటున్నాం... మీరు కూడా మా వీడియో చూడండి’ అని రాశారు. ఈ సందర్భంగా విజేందర్ తన వీడియోను, ఫొటోలను షేర్ చేశారు.

Updated Date - 2020-03-23T14:12:16+05:30 IST