బ్రిటన్ ప్రధానమంత్రికి కోవిడ్-19 పాజిటివ్
ABN , First Publish Date - 2020-03-27T22:34:53+05:30 IST
ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి వ్యక్తిగత సలహా మేరకు ప్రధానమంత్రిని కరోనావైరస్ కోసం పరీక్షించారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి అన్నారు. ఈ పరీక్ష ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది నిర్వహించారని ఆయన తెలిపారు.
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చింది. కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోగా ఆయనకు పాజిటీవ్ అని తేలిందని ఆయనే స్వయంగా తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాధినేతనే కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది.
‘‘నాకు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయి’’ అని బోరిస్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి వ్యక్తిగత సలహా మేరకు ప్రధానమంత్రిని కరోనావైరస్ కోసం పరీక్షించారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి అన్నారు. ఈ పరీక్ష ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది నిర్వహించారని ఆయన తెలిపారు.
కాగా బ్రిటన్‌లో 11,658 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా, ఈ కరోనా వల్ల 578 మంది మరణించారు.