అఫ్ఘాన్‌లో బాంబు పేలుడు

ABN , First Publish Date - 2020-12-19T06:40:13+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో శుక్రవారం భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15మంది పిల్లలు కన్నుమూయగా..

అఫ్ఘాన్‌లో బాంబు పేలుడు

15మంది చిన్నారులు మృతి


కాబూల్‌, డిసెంబరు 18: అఫ్ఘానిస్థాన్‌లో శుక్రవారం భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15మంది పిల్లలు కన్నుమూయగా.. 20మంది తీవ్రగాయాలపాలయ్యారు. తాలిబన్ల ప్రభావిత ప్రాంతంగా ఉన్న తూర్పు అఫ్ఘానిస్థాన్‌లో ఈ దారుణం జరిగింది. స్థానిక గిలాన్‌ జిల్లాలోని ఒక గ్రామంలోకి ప్రవేశించిన రిక్షాలో ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన బాంబు పేలిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో రిక్షా చుట్టూ చిన్నారులు ఉండటంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు. ‘‘మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దాడికి తామే పాల్పడ్డామని ఎవరూ ప్రకటించలేదు. పిల్లల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని అధికారులు తెలిపారు. అయితే.. తాలిబన్లు మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. ఆ బాంబు గతంలోనే అక్కడ ఉందని, పిల్లలు తెలియకుండా దాన్ని రిక్షా వ్యక్తి వద్దకు తీసుకురావడంతో పేలుడు జరిగిందని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతం తాలిబన్ల అదుపులో ఉండటంతో వాస్తవంగా ఏం జరిగిందన్నది మాత్రం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.

Updated Date - 2020-12-19T06:40:13+05:30 IST