ఓయో బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌

ABN , First Publish Date - 2020-10-21T23:50:52+05:30 IST

ఓయో బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌

ఓయో బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌

న్యూఢిల్లీ: తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ను ప్రముఖ సంస్థ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ప్రకటించింది. సోనూసూద్‌ శానిటైజ్డ్‌ బిఫోర్‌ యూవర్‌ ఐస్‌ ప్రచారం చేస్తారు. ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ఇప్పుడు శానిటైజ్డ్‌ స్టేస్‌ను మే 2020లో యునిలివర్‌తో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించింది. దీనిద్వారా తమ శానిటైజేషన్‌ మరియు పరిశుభ్రతా ప్రయత్నాలను వృద్ధి చేస్తున్నారు.


ఈ ప్రయత్నాలలో మరో అడుగు ముందుకు వేస్తూ, ఈ ఆతిథ్య రంగ సంస్థ శానిటైజేషన్‌ ప్రయత్నాలను వాస్తవ సమయంలో ప్రదర్శించడంతో పాటుగా ప్రయాణీకులకు విశ్వాసాన్ని కలిగించేందుకు ఓయో ఎస్‌బీవైఈ లేదా శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌ను బాలీవుడ్‌ నటుడు, ఓయో ఎస్సెట్‌ యజమాని సోనూసూద్‌ను ఈ ప్రచార ముఖ చిత్రంగా ఆవిష్కరించింది. వినియోగదారులపై దృష్టి కేంద్రీకరించిన ఈ ప్రచారాన్ని టీవీ, డిజిటల్‌ వేదికలపై తమ మొదటి యాడ్‌ –‘ పెహలే స్ర్పే, ఫిర్‌ స్టే’ అంటూ నేడు విడుదల చేశారు.


పర్యాటకులను ఆహ్వానించేందుకు ఓయో హోటల్స్, హోమ్స్ తెరువబడ్డాయి. దగ్గరలోని కొండ ప్రాంతాలకు లేదంటే దగ్గరలోని బీచ్‌కు వెళ్లడానికి లేదా తమ నగర సరిహద్దులలోనే స్టేకేషన్‌ను ఆస్వాదించడానికి భారతీయులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వినియోగదారులకు నమ్మకమైన వసతి, విధానాలను తమ ఆందోళనలను పొగొట్టుకునేందుకు ఓయో ప్రచారం చేస్తోంది. శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌ ద్వారా వినియోగదారులకు మనశ్శాంతిని అందిస్తున్నామని పేర్కొంది.


ఉదాహరణకు, అతిథులు తమ గదిలో లైట్లను ఆన్‌చేయడానికి ప్రయత్నించాలనుకునే లోపుగానే సోనూసూద్‌ అతిథులు మాట బయటకు రాకమునుపే మాస్టర్‌ స్విచ్‌బోర్డ్‌పై స్ర్పే చేస్తారు. అదే రీతిలో అతిథులు టీవీ స్విచ్‌ దగ్గరకు చేరుకునే లోపుగానే టీవీ రిమోట్‌ కంట్రోల్‌పై స్ర్పే చేయడంతో పాటుగా ఇతర వస్తువులను సైతం స్ర్పే చేస్తారు.


‘‘ఓయోతో ఎస్సెట్‌ భాగస్వామిగా, గత కొద్ది నెలలుగా ఓయో బృందం చేపడుతున్న పలు చర్యలను తొలుత అనుభవించిన వారిలో నేనూ ఒకడిని. కేవలం అతిథులకు సురక్షిత అనుభవాలను అందించడం మాత్రమే కాదు, ప్రణాళికా ప్రక్రియ నుంచి అతిథుల ప్రయాణంలో తోడ్పాటునందిస్తున్నాం. ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు ఓయో తోడ్పడుతుందని ఓయో బ్రాండ్‌ అంబాసిడర్‌ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ పేర్కొన్నారు. 


80శాతం మంది వినియోగదారులు శానిటైజ్డ్‌ స్టేస్‌ కోసం వెదుకుతుంటే, 46శాతం మంది వినియోగదారులు రెగ్యులేషన్‌ సంబంధిత సమాచారం కోరుకుంటున్నారని ఓయో అధ్యయనంలో తేలింది. అది దృష్టిలో పెట్టుకుని ఓయో ఇటీవలనే ప్రయాణ సంబంధిత అవసరాలను తీర్చడం కోసం ఓయో యాప్‌పై సహాయ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో కోవిడ్‌–19 పరీక్షలు సైతం భాగంగా ఉంటాయి.

Updated Date - 2020-10-21T23:50:52+05:30 IST