లిబియా తీరంలో నాలుగు మృతదేహాలు లభ్యం
ABN , First Publish Date - 2020-12-17T15:31:27+05:30 IST
లిబియా దేశానికి చెందిన 30 మంది వలసదారులు ప్రయాణిస్తున్న పడవ జావియా ప్రాంతంలోని సముద్రంలో మునిగిపోయిందని...

సముద్రంలో పడవబోల్తా...
జావియా (లిబియా) : లిబియా దేశానికి చెందిన 30 మంది వలసదారులు ప్రయాణిస్తున్న పడవ జావియా ప్రాంతంలోని సముద్రంలో మునిగిపోయిందని లిబియన్ రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. వలసదారుల పడవ మునిగిపోవడంతో నలుగురు పిల్లల మృతదేహాలు లిబియా దేశ తీరంలోకి కొట్టుకువచ్చాయని లిబియాకు చెందిన హసన్ మొఖ్తర్ అల్ బే చెప్పారు.ట్రిపోలి నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని జావియాలో మరో మూడు మృతదేమాలను రెస్క్యూ వర్కర్లు కనుగొన్నారు. యుద్దంలో దెబ్బతిన్న లిబియా వలసదారులు ప్రాణాంతకమని తెలిసినా పడవల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. సముద్ర తీరంలో మృతదేహాలతో పాటు దుప్పట్లు కూడా దొరికాయి. వలసదారులు అక్రమంగా పడవల్లో ప్రయాణిస్తూ పలు సార్లు ప్రమాదాల పాలై మరణించారు.