చంబల్ నదిలో పడవ బోల్తా... 10 మంది గల్లంతు!

ABN , First Publish Date - 2020-09-16T16:12:09+05:30 IST

కోటా జిల్లాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాతంలో చంబల్ నదిని దాటుతున్న ఒక పడవ నీట మునిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ పడవలో...

చంబల్ నదిలో పడవ బోల్తా... 10 మంది గల్లంతు!

జైపూర్: కోటా జిల్లాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాతంలో చంబల్ నదిని దాటుతున్న ఒక పడవ నీట మునిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ పడవలో 14 బైక్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. 



మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోఠలా కాలా సమీపంలోని కమలేశ్వర్ ఆలయానికి వెళుతున్న పడవ నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారు స్థానికుల సహాయంతో బతికి బయటపడ్డారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2020-09-16T16:12:09+05:30 IST